

నిహారిక కొణిదెల యువతను దృష్టిలో పెట్టుకుని వెబ్ సిరీస్‌లు మరియు చిన్న సినిమాలు నిర్మిస్తోంది. ఉమేశ్ కుమార్ బన్సాల్‌తో కలిసి ఆమె నిర్మించిన ‘రాకాస’ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. ప్రమోషన్ల వల్ల ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది.
ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుని మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో సినిమా మరింతగా ప్రేక్షకుల దగ్గరికి చేరనుంది.
కథ విషయానికి వస్తే, వీరూ విదేశాల నుంచి తన ప్రేమించిన అమ్మాయి కోసం వస్తాడు. కానీ ఆమెకు మరో పెళ్లి జరుగబోతుందని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆ పెళ్లిని ఆపే ప్రయత్నంలో సుబ్బలక్ష్మితో ప్రేమలో పడతాడు. గ్రామ ఆచారం ప్రకారం రాక్షస గుహలోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఏమి జరుగుతుంది? అతన్ని కాపాడేందుకు సుబ్బలక్ష్మి ఏం చేస్తుంది? అన్నదే కథ. ఈ సినిమా ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.




.webp&w=3840&q=75)













.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!