
న్యూస్

టి. హరీష్ రావు ఆకస్మికంగా న్యూ ఢిల్లీ వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై కమిషన్ నివేదికను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై ఏప్రిల్ 22న తీర్పు వెలువడనుంది.
తీర్పు ప్రతికూలంగా వచ్చిన పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు హరీష్ రావు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో భారత్ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్ రావు జగిత్యాలలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో హరీష్ రావు ఢిల్లీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!