

వెనెజువెలాలో సురక్షితమైన, న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకూ అమెరికానే ఆ దేశాన్ని పరిపాలిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దేశ భద్రత పూర్తిగా స్థిరపడే వరకు వెనెజువెలాలో అమెరికా పాలన కొనసాగుతుందని తెలిపారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్టులో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇది అమెరికా ప్రజల భద్రత కోసం తీసుకున్న కీలక నిర్ణయమని అన్నారు.
వెనెజువెలాలో చమురు రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, అమెరికా కంపెనీలు అక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చేసి ఆదాయం సృష్టిస్తాయని ట్రంప్ చెప్పారు. దేశంలోని సైన్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామని, దాడుల సమయంలో రాజధాని కారకాస్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని వెల్లడించారు. మదురోకు మద్దతిచ్చే నేతలకు హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్, నియంత పాలన ముగియడంతో వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, వారిని ఆర్థికంగా బలపరిచే దిశగా అమెరికా ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.


_1771477764226.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!