

వంటల వీడియో లతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ‘విలేజ్ కుకింగ్’ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మరో మైలురాయిని అందుకుంది. ఈ ఛానల్‌కు సబ్స్క్రైబర్ల సంఖ్య 3 కోట్లను దాటింది. తమిళనాడు లో పుదుకోట్టై జిల్లా చిన్నవీరమంగళం గ్రామానికి చెందిన సుబ్రమణియన్, అయ్యనార్, పెరియతంబి, మురుగేశన్, ముత్తుమాణిక్యం, తమిళ్‌సెల్వన్ అనే ఆరుగురు కలిసి 2018 లో ఈ ఛానల్‌ను ప్రారంభించారు. పెద్ద స్థాయిలో సంప్రదాయ వంటలు చేసి వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
చానల్‌కు నెమ్మదిగా ఆదరణ పెరుగుతున్న సమయంలో, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఈ టీమ్ తో కలిసి వంట చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఒకే దెబ్బకు కోటి సబ్స్క్రైబర్లు చేరి ఛానల్ వేగంగా ఎదిగింది.
తాజాగా ఈ ఛానల్ సబ్స్క్రిప్షన్లు 3 కోట్ల మార్క్‌ను దాటి, ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ఫుడ్ కంటెంట్ అందించే యూట్యూబ్ ఛానళ్లలో నాల్గవ స్థానంలో నిలిచింది. సంప్రదాయ రుచులు, సాదాసీదా గ్రామీణ వాతావరణం, పెద్దఎత్తున వంట చేసే స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.








.png&w=3840&q=75)









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!