

దేవుడు స్వార్థపరుడు ముందు ఘంటసాలను తీసుకెళ్లారని, ఆ తర్వాత ఎస్పీబీని తీసుకెళ్లారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎస్పీబీని స్వరసార్వభౌమత్వానికి నిదర్శనంగా పేర్కొన్నారు. సంగీత దర్శకుడు కోరుకున్న ప్రతి భావాన్ని అక్షయపాత్రలా అందించే గొప్ప గళం ఆయనదని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సోమవారం రవీంద్ర భారతి లో ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు విగ్రహం ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఢిల్లీ పర్యటన లో సీఎం ఉన్నందున అయన అటెండ్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
విగ్రహం ఆవిష్కరణ తరువాత రవీంద్ర భారతి లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో వెంకయ్య నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు, ఎస్పీ బాలు చెల్లెలు ప్రముఖ సింగర్ ఎస్పీ శైలజ, బాలు కుమారుడు ఎస్పీ చరణ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ మాట్లాడుతూ, రవీంద్ర భారతిలో తన విగ్రహం ఏర్పాటు చేయాలన్నది బాలు గారి చివరి కోరిక అని వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల బాలు విగ్రహాలు ఉన్నప్పటికీ, ఆయన ఆశయాన్ని నెరవేర్చడం సంగీత ప్రియులకు గొప్ప గౌరవంగా నిలుస్తుందని ఆమె అన్నారు.













.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
Great Singer..SP Balu garu