
న్యూస్

భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు విశాఖపట్నం మెట్రో రైలు నెట్వర్క్ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు, అలాగే రుషికొండ ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలి వరకు విస్తరించాలని కోరారు. నిన్న మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డితో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కొమ్మాది నుంచి భోగాపురం వరకు మెట్రో మార్గాన్ని విస్తరించడం వల్ల విమాన ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని, అలాగే ప్రాంతీయ అభివృద్ధికి పెద్ద మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రుషికొండలో టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!