
న్యూస్

కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. వేకువజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోగా, ముందుగా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిర్వహించారు. ఉదయం 5.30 గంటల నుంచి ఈ-డిప్ టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో, సోమవారం రాత్రి వరకు సుమారు 55 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు సహా పెద్ద సంఖ్యలో వీఐపీలు శ్రీవారి దర్శనానికి హాజరయ్యారు.

.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!