

భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ 2026 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 పురుషుల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియన్, మహ్మద్ ఫిక్రీ జోడీపై 18-21, 21-17, 21-16 తేడాతో విజయం సాధించారు. తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ గంటా 13 నిమిషాల పోరులో టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఈ విజయంతో సింగపూర్ ఓపెన్ గెలిచిన తొలి భారత పురుషుల డబుల్స్ జోడీగా సాత్విక్-చిరాగ్ చరిత్ర సృష్టించారు. ఇది వారి కెరీర్‌లో మూడో సూపర్ 750 టైటిల్ కాగా, 2024 థాయ్‌లాండ్ ఓపెన్ తర్వాత సాధించిన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్. ఇటీవల థామస్ అండ్ ఉబెర్ కప్‌లో భారత జట్టుకు కాంస్య పతకం అందించడంలో కీలక పాత్ర పోషించిన ఈ జోడీ, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!