

మాజీ మంత్రి హరీష్‌రావు తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు మరోసారి తెరదించారు. తన పుట్టుక, రాజకీయ ప్రయాణం, చివరి వరకు అన్నీ బీఆర్ఎస్‌తోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే తన రాజకీయ జీవితం ముడిపడి ఉందని పేర్కొంటూ, పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఆయన విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు.
అలాగే రాష్ట్రంలో విద్యుత్, నీటి సరఫరా అంశాలపై కూడా హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోలో వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీటి అవసరాలకు థర్మల్ పవర్‌కు బదులుగా సోలార్ పవర్ వినియోగంపై ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో విద్యుత్ కోతలు, నీటి సమస్యలు తలెత్తే అవకాశముందని ఆయన ఆరోపించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!