

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండించింది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ, ఇది ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన చర్య అని ఆరోపించారు.
రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు రాజకీయ ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీతో పాటు మల్కాజ్‌గిరి, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోస్టర్లు, బ్యానర్ల వెనుక ఉన్న వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించి సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!