
జనరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, దీపికా పదుకొణె కథానాయికగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం రాకాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు చూడని స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుందని మేకర్స్ చెబుతున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా టాక్ ప్రకారం ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్‌ను ఆగస్టులో విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ గ్లింప్స్ ద్వారా సినిమా ప్రపంచం, విజువల్ స్కేల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!