

భారత్–రష్యా మధ్య చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగితే భారత్‌పై సుంకాలు పెంచుతానని హెచ్చరించారు. ‘‘ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సాగుతున్న సమయంలో ఈ తరహా హెచ్చరికలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మేరకు వైట్ హౌస్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఆడియోను సోమవారం మీడియా విడుదల చేసింది. ఆ ఆడియోలో ఏముందంటే..‘ అమెరికాతో భారత్ వాణిజ్య లావాదేవీలు కొనసాగిస్తోంది. భారత్ వాణిజ్య లావాదేవీలపై త్వరలో సుంకాలు పెంచుతా. భారత్ నన్ను సంతోషపెట్టాలని కోరుకుంటున్నాను. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసు. నన్ను సంతోషపెట్టడం భారత్‌కు చాలా ముఖ్యం’ అని చెప్పుకొచ్చారు. కాగా, గతంలో భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!