
సినిమాలు

ఇరాన్లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత త్వరగా దేశాన్ని వీడాలని సూచించింది. బయటకు వెళ్లే సమయంలో అధికారికంగా చెప్పిన మార్గాలనే ఉపయోగించాలని, ఎలాంటి సమాచారం లేకుండా సరిహద్దుల దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించింది.
అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. ఇందుకోసం +989128109115, +989128109109, +989128109102, +989932179359 హెల్ప్‌లైన్ నంబర్లను అందించింది. అలాగే cons.tehran@mea.gov.in ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!