
న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన విమర్శలకు కేరళ ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అని ఆరోపించడం సరైంది కాదని చెప్పారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి సోషల్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
కేరళలో అవినీతి తక్కువగా ఉండటంతో పాటు పేదరికం కూడా తక్కువగా ఉందని తెలిపారు. అక్షరాస్యతలో తమ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో కూడా కేరళ ముందుందని పేర్కొన్నారు. జీతాలు, పెన్షన్లు ఆలస్యం చేసే వారు తమ వద్ద పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!