

తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. డీఎంకే కాంగ్రెస్, అన్నాడీఎంకే బీజేపీ కూటముల మధ్య హోరాహోరీ పోరు తప్పదని ప్రీ పోల్ సర్వేలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో నటుడు విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడం ప్రత్యేకంగా మారింది. అలాగే సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కచ్చి (ఎన్‌టీకే) కూడా ఒంటరిగానే పోటీ చేస్తోంది.
పోటీ పెరగడంతో ఈసారి గెలిచే అభ్యర్థులకు భారీ మెజార్టీలు రావడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించాల్సి రావడంతో డీఎంకే, అన్నాడీఎంకేలు 21 స్థానాల్లో పోటీ చేయడం లేదు. ఆ స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు ప్రధాన పార్టీ గుర్తులు లేకుండానే బరిలోకి దిగుతున్నారు. చిన్న పార్టీల ప్రాధాన్యం పెరగడం వల్ల సీట్ల కేటాయింపులో మార్పులు వచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా బరిలోకి దిగిన టీవీకే ప్రభావంతో ఈసారి ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని వారు విశ్లేషిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!