
సినిమాలు

ప్రజలకు రోజువారీ లావాదేవీల్లో మరింత సౌలభ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో హైబ్రిడ్ ఏటీఎంలను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఏటీఎంల ద్వారా రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
పెద్ద నోట్లను డిపాజిట్ చేసినప్పుడు, అవసరానికి అనుగుణంగా చిన్న నోట్లు మాత్రమే కాకుండా నాణేలు కూడా ఇచ్చే విధంగా ఈ ఏటీఎంలను రూపొందిస్తున్నారు. దీని వల్ల చిల్లర కోసం ఎదురయ్యే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
అదేవిధంగా, చిన్న కరెన్సీ నోట్లు, నాణేల పై పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు వాటి ముద్రణను మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చర్యలతో దేశవ్యాప్తంగా చిల్లర కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!