
టెక్నాలజీ

తెలుగు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ కేటగిరీలో మరో రెండు కొత్త రైళ్లను తెలంగాణకు కేటాయించింది. ఈ రైళ్లు చర్లపల్లి–నాగర్ కోయల్, నాంపల్లి–తిరువనంతపురం మార్గాల్లో ఏపీ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కొత్త అమృత్ భారత్ రైళ్లను ఈ నెల 23న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి నడిచే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య మూడుకు పెరుగుతుంది. దీని ద్వారా దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుందని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!