
న్యూస్

మహేశ్వరం మండల కేంద్రంలోని కేసీ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేసీ తండాకు చెందిన జటావత్ రిషి, బద్రీనాథ్ అనే ఇద్దరు బాలురు కొత్వాల్ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆటలాడుకుంటూ చెరువు సమీపానికి వెళ్లిన వారు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే ఇద్దరి మృతదేహాలను చెరువు నుంచి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కేసీ తండా ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారుల మరణంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!