

ఎస్.ఎస్. వెంకటేష్ తెలుగు సినీ పరిశ్రమలో సౌండ్ డిజైనర్‌గా, సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1987 ఏప్రిల్ 6న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సత్యవతి, హనుమంతరావు దంపతులకు జన్మించిన ఆయన, బుచ్చిరెడ్డిపాలెం మరియు ప్రకాశం జిల్లా అద్దంకిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో 2004లో హైదరాబాద్‌కు వచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేస్తున్న తన అన్నయ్య ప్రభావంతో సంగీత రంగంపై మరింత ఆసక్తి పెంచుకున్నారు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన ఆయన చిన్ననాటి నుంచే సంగీతంపై పట్టు సాధించారు.
లక్ష్యం సినిమాతో డబ్బింగ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వెంకటేష్, అనంతరం పలు చిత్రాలకు సేవలందించారు. రామోజీ ఫిలిం సిటీలో ప్రసిద్ధ టెలివిజన్ కార్యక్రమం ‘నేరాలు-ఘోరాలు’కు ఇంజనీర్‌గా, సంగీత దర్శకుడిగా దాదాపు వెయ్యి ఎపిసోడ్‌లకు పనిచేశారు. 2010లో తన అన్నయ్యతో కలిసి ఏంజిల్ స్టూడియోను స్థాపించి సినిమాలు, ఆధ్యాత్మిక వీడియోలు మరియు ఇతర ప్రాజెక్టులకు సేవలందించారు. అనంతరం సొంత స్టూడియో ఏర్పాటు చేసి సినిమాలు, ప్రకటనలు, పాటలు, షార్ట్ ఫిలింలకు సౌండ్ డిజైనర్‌గా, సంగీత దర్శకుడిగా పనిచేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఆచార్య, భోళా శంకర్, కన్నప్ప సహా పలు ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో తన ప్రతిభను చాటుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!