

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గుర్తించి, వారికి సముచిత గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు సేకరించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఉద్యమంలో పాల్గొన్న వారిని న్యాయబద్ధంగా గుర్తించి గౌరవించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
ఈ సమావేశం జూన్ 4న ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆరో అంతస్తు, గది నంబర్ 33లో నిర్వహించనున్నారు. ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేసి సమావేశానికి పంపాలని ప్రభుత్వం కోరింది. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు సచివాలయంలోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశించేందుకు ముందస్తు సమన్వయం చేసుకోవాలని అధికారిక ప్రకటనలో సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!