

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఈ రోజు మూడు కీలక ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. రోడ్లు మరియు భవనాల (R&B) శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనుంది. అదనంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులను ప్రకటించింది.

ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ పోస్టులకు జూన్ 6 నుంచి, ఎలక్ట్రికల్ పోస్టులకు జూన్ 8 నుంచి, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్లు రాష్ట్రంలోని ఇంజినీరింగ్ పట్టభద్రులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను విస్తరించనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!