

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న వేళ, తెలంగాణ గడ్డపై నిలబడి రాష్ట్ర భావోద్వేగాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తెలంగాణపై ఇంకా వివక్ష, వ్యతిరేక భావజాలం కొన్ని వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు, ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిందని కోమటిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రజలు సహించరని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప ప్రాంతీయ విద్వేషాలకు తావివ్వకూడదన్నారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడులకు స్వాగతం పలుకుతామని, అయితే రాష్ట్ర అస్థిత్వాన్ని కించపరిచే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్తామని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!