
ఆరోగ్యం

ఏపీ రాజధాని అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు పెద్ద ఎత్తున పనులు ప్రారంభం కానున్నాయి. ఈ విస్తరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలపరిచే కీలక అడుగుగా ఈ ప్రాజెక్ట్ను అధికారులు భావిస్తున్నారు.
మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఆలయ అభివృద్ధి చేపట్టనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని లక్ష్యంగా, ఆలయ నిర్మాణ రూపకల్పనను తుది రూపంలో సిద్ధం చేశారు.
ఈ విస్తరణలో ఆలయ ప్రాకారం, మహా రాజగోపురం, వివిధ మండపాలు, అలాగే ఆంజనేయస్వామి ఆలయాల నిర్మాణం కూడా ఉంది. ఈ కొత్త మార్పులతో అమరావతి టీటీడీ ఆలయం భక్తులకు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.




















కామెంట్స్ (3)
అమరావతి ఆధ్యాత్మిక వికాసానికి అద్భుత ఆరంభం!
Amaravati to shine as a spiritual hub
Excited for Amravati