
జనరల్

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్ స్పందిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం డబ్బులు పంచి, లాబీలు చేసి సాధించలేదని, ఇది ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితమని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డ గతంలో తమ పెద్దలదైతే, నేడు తమదని, రేపు తమ పిల్లలదని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం ప్రజల ఆకాంక్షలతో సాగిన చారిత్రాత్మక పోరాటమని అన్నారు.
ఉద్యమ సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో తల్లులు తమ పిల్లలను కోల్పోయి బాధను అనుభవించారని వెన్నెల గుర్తు చేశారు. తెలంగాణ అన్న కారణంతో చాలా మందిపై నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు జరిగాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌ను నటుడిగా, గద్దర్ అభిమానిగా చాలామంది ఇష్టపడతారని చెప్పిన ఆమె, తెలంగాణ సాధన వెనుక ఉన్న త్యాగాలను ఎవరూ తక్కువ చేసి చూడకూడదని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!