
సినిమాలు

నైరుతీ రుతుపవనాలు రేపు కేరళ తీరాన్ని తాకనున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఇవి 5వ తేదీన రాయలసీమలోకి ప్రవేశించి, 10వ తేదీ నాటికి దక్షిణ కోస్తా అంతటా విస్తరించనున్నాయి. 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేసే అవకాశం ఉంది. రాబోయే వారం రోజులపాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతాయని అధికారులు తెలిపారు.
తదుపరి ఐదు రోజులపాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు కూడా ఎక్కువగా పడతాయని భావించడం సరికాదని అధికారులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ప్రకారం, వేసవి తీవ్రతకు వర్షపాతం మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!