

ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రమశిక్షణ, సమయపాలన పెంపొందించేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి రాష్ట్ర సచివాలయంలోని హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్‌మెంట్ (HRM) శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికి బయోమెట్రిక్ లేదా ఫేస్ ఐడి ఆధారిత హాజరు విధానాన్ని తప్పనిసరి చేసింది. ఉదయం 10 గంటలలోపు కార్యాలయానికి హాజరై డిజిటల్ విధానంలో హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పారదర్శకత, జవాబుదారీతనం, సమయపాలనను మెరుగుపరచడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలిపింది. ప్రారంభ దశలో డిజిటల్ హాజరుతో పాటు రిజిస్టర్‌లో సంతకం కూడా కొనసాగుతుంది. గతంలో ట్రయల్ రన్ సమయంలో ఉద్యోగులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా హెచ్‌ఆర్‌ఎం శాఖలో ప్రారంభించిన ఈ వ్యవస్థను త్వరలో సచివాలయంలోని ఇతర శాఖలకు కూడా విస్తరించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!