
జనరల్

వాట్సప్ కాల్స్, సోషల్ మీడియా సంభాషణలను ప్రభుత్వం రికార్డ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి కొందరు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు సూచించారు.
వైరల్ పోస్టులో రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఫోన్ కాల్స్, వాట్సప్, ఫేస్‌బుక్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాలపై పూర్తి నిఘా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని పోలీసులు తేల్చిచెప్పారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత మాత్రమే నమ్మాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!