
టెక్నాలజీ

ఏఐసీసీ తమిళనాడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులను నియమించింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలకు సీనియర్ అబ్జర్వర్‌గా ఆయనను నియమించింది.
ఇక తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డీఎంకే పార్టీతో కలిసి పొత్తులో ఎన్నికలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ నియామకాలు కీలకంగా భావిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23న జరగనున్నాయి.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!