

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో చైనా ఇరాన్‌కు రహస్యంగా సహాయం చేస్తున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా సైనిక మోహరింపులు, ఆయుధ నిల్వలు, యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకల కదలికలు, సైనిక స్థావరాలపై నిరంతర నిఘా కోసం చైనా టెక్ సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ) మరియు ఓపెన్ సోర్స్ డేటాను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు యుద్ధాన్ని ఆపాలని చైనా బహిరంగంగా పిలుపునిస్తుండగా, మరోవైపు ప్రైవేట్ కంపెనీల సహాయంతో ఇరాన్‌కు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా డేటా వంటి బహిరంగ సమాచారం ఆధారంగా అమెరికా సైనిక కదలికలను ట్రాక్ చేసి, ఆ వివరాలను ఇరాన్ సైనిక అధికారులకు పంపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తోంది. నిపుణుల ప్రకారం, ఒకప్పుడు పరిమిత వర్గాలకే అందుబాటులో ఉన్న ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఏఐ సాంకేతికత వల్ల సాధారణ వ్యక్తులకు కూడా చేరువవుతోంది. దీని వల్ల కేవలం అమెరికాకే కాకుండా ఇతర దేశాల భద్రతకు కూడా ముప్పు పెరుగుతుందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ సాంకేతిక ముప్పును ఎదుర్కొనే మార్గాలపై అమెరికా అధికారులు, నిపుణులు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!