
టెక్నాలజీ

కాలం మారుతున్నప్పటికీ విడాకులపై సమాజంలో ఇంకా అనేక అపోహలు కొనసాగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ కుటుంబం తమ కుమార్తె విడాకులను ఘనంగా జరుపుకోవడం విశేషంగా నిలిచింది. న్యాయస్థానం విడాకులు మంజూరు చేసిన అనంతరం కుమార్తెను కోర్టు బయట పూలవర్షంతో స్వాగతించి, మేళతాళాలతో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లి స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు.
రిటైర్డ్ న్యాయమూర్తి జ్ఞానేంద్ర కుమార్ కుమార్తె ప్రణీత వశిష్ఠ వివాహ జీవితంలో వేధింపులు ఎదుర్కొని విడాకులు తీసుకుంది. భరణం కూడా వద్దని స్పష్టంగా తెలిపిన ఆమెకు కుటుంబం అండగా నిలిచింది. కుమార్తెల సంతోషం, గౌరవమే ముఖ్యమని ఆమె తండ్రి పేర్కొన్నారు. బాధలు ఎదుర్కొంటున్న మహిళలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ముందుకు రావాలని, స్వతంత్రంగా నిలబడాలని ప్రణీత పిలుపునిచ్చింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!