
న్యూస్

సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లు వెంటనే సమ్మె విరమించి గురువారం ఉదయం 11 గంటలలోగా విధుల్లో చేరాలని, లేదంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లేనని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో, తెలంగాణ నిత్యావసర సేవల నిర్వహణ చట్టం (టెస్మా) ప్రకారం విద్యుత్ సరఫరా నిత్యావసర సేవల్లో భాగమని, ఈ రంగంలో సమ్మెలకు నిషేధం ఉన్నట్లు పేర్కొంది.
ఈ చట్టం కింద ప్రస్తుతం జరుగుతున్న సమ్మె అక్రమమని ట్రాన్స్‌కో తెలిపింది. ఇప్పటికీ విధుల్లో చేరని తాత్కాలిక ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల ఐక్య కార్యాచరణ సమితి ఇప్పటికే పారిశ్రామిక ట్రైబ్యునల్‌ను ఆశ్రయించినప్పటికీ, విచారణ కొనసాగుతున్న సమయంలో సమ్మె చేయడం నిబంధనలకు విరుద్ధమని ట్రాన్స్‌కో వివరించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!