
న్యూస్

సారా అర్జున్ ‘ధురంధర్’ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తరువాత, ఇప్పుడు మధుబాల బయోపిక్‌లో ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తుండగా, జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల జీవితంలోని సినీ ప్రయాణం, వ్యక్తిగత భావోద్వేగాలను భారీ స్థాయిలో చూపించడానికి ప్రణాళిక చేస్తున్నారు.
మొదట ఈ పాత్ర కోసం కియారా అద్వానీను పరిశీలించినప్పటికీ, సారా అర్జున్ నటన చూసి ఆమెనే ఎంపిక చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఈ బయోపిక్ సారా అర్జున్ కెరీర్‌కు కీలక మలుపు అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!