

అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు కొనసాగించడంతో ఇరాన్ మళ్లీ జలసంధిపై నియంత్రణ కఠినతరం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ భారీగా సీమైన్స్‌ను అమర్చినట్లు ప్రకటిస్తూ ప్రమాద ప్రాంతాలు, సురక్షిత మార్గాలపై చార్ట్‌ను విడుదల చేసింది.
సాధారణంగా నౌకలు ప్రయాణించే మార్గాల్లో ప్రమాదం ఎక్కువగా ఉందని, లారక్ దీవి సమీపంగా ప్రయాణించాలని ఇరాన్ సూచించింది. ఈ సీమైన్స్ ఇప్పటికీ ఉన్నాయా లేదా తొలగించబడాయా అన్నది స్పష్టంగా తెలియదు. కాల్పుల విరమణ తర్వాత మొదటి రోజున కేవలం నాలుగు నౌకలే ఈ మార్గాన్ని దాటినట్లు సమాచారం. రోజుకు 15 నౌకలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో పాటు ఐఆర్జీసీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఇదే సమయంలో భారత్ ప్రభుత్వం భారత నావికులకు జాగ్రత్తగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!