
సినిమాలు

కర్ణాటకలోని బాబలేశ్వర్ జిల్లా సమీపంలో శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. మంగళూరు ప్రాంతంలో రెడ్‌బర్డ్ సంస్థకు చెందిన శిక్షణా విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పొలాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాయి.
గమనార్హమైన విషయం ఏమిటంటే, గత ఏడాది డిసెంబర్లో కూడా రెడ్‌బర్డ్ సంస్థకు చెందిన మరో శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో శిక్షణా విమానాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!