

యంగ్ హీరోయిన్ శ్రీజ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం ఘనంగా లాంఛ్ అయింది. “దేవగుడి” ఫేమ్ హీరో అభినవ్ శౌర్య ఈ పాటలో హీరోగా నటించగా, రఘురామ్ సంగీతం, సాహిత్యం అందించారు. గాయని లిప్సిక ఈ పాటను ఆలపించారు. కార్యక్రమానికి హాజరైన సినీ ప్రముఖులు శ్రీజ ప్రతిభను, ఆమె కృషిని ప్రశంసిస్తూ ఈ సాంగ్ మూవీ పాటలా రిచ్‌గా ఉందని అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీజ తన ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీవీ షోలు, సినిమాల ద్వారా వచ్చిన అనుభవంతో ఇప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నానని అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించామని, బడ్జెట్ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. హీరో అభినవ్ శౌర్య కూడా శ్రీజ పట్టుదల, స్పష్టతను ప్రశంసిస్తూ ఈ పాటకు తానే కొరియోగ్రఫీ చేసినట్లు తెలిపారు. ఈ సాంగ్ ప్రేక్షకులకు నచ్చి మంచి విజయాన్ని అందుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!