
న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చిన్నారులను ఆన్‌లైన్ ప్రభావాల నుంచి రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
చిన్న వయసులో సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం, చదువుపై దృష్టి మరియు వ్యక్తిత్వ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ చట్టంలో కఠిన నిబంధనలు ఉండే అవకాశముంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అమల్లో ఉంది. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!