
సినిమాలు

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు సుమారు 10 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
అలాగే నారాయణగిరిలో ఏర్పాటు చేసిన షెడ్లో సర్వదర్శన భక్తులు వేచి ఉండగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు నిల్వ ఉన్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దర్శనానికి సమయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!