

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ చిత్రం ‘వారణాసి’ తన అంతర్జాతీయ ప్రమోషన్లను అధికారికంగా ప్రారంభించింది. ఈ సినిమా తొలి గ్లోబల్ ప్రజెంటేషన్ కోసం మెక్సికో వేదికగా ఎంపికైంది. ప్రతిష్ఠాత్మక CCXP 2026 ఈవెంట్‌లో ‘వారణాసి’ కోసం ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పాల్గొననున్నారని సమాచారం.
ఈ వేడుకలో భాగంగా సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ ( బీటీఎస్) వీడియోలను ప్రదర్శించనున్నారు. అలాగే, సినిమా మేకింగ్ విశేషాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. ప్రజెంటేషన్ అనంతరం ఆడియన్స్‌తో నేరుగా ముచ్చటించడం ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారతీయ సంస్కృతి, పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!