

మరో వారం వచ్చేసింది కానీ ఈసారి థియేటర్లలో పెద్దగా సందడి కనిపించడం లేదు. “గేదెల రాజు” అనే తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా, దానిపై పెద్దగా ఆసక్తి లేదు. మరోవైపు మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తీసిన “మైకేల్” బయోపిక్, అలాగే మలయాళ సీక్వెల్ “వాలా 2” ఈ వీకెండ్ తెలుగు డబ్బింగ్లో విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీ వేదికల్లో మాత్రం ఈ వారం భారీగా కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఈ రోజు నుంచి ఈ నెల26 వరకు దాదాపు 19కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల అవుతున్నాయి. “ప్రతిఛాయ”, “బ్యాండు మేళం”, “లేచింది మహిళా లోకం” వంటి తెలుగు చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అలాగే “హ్యాపీ రాజ్” కూడా ఈ వీకెండ్ వచ్చే అవకాశం ఉంది. హాట్‌స్టార్‌లో “బ్రూక్లిన్ నైన్ నైన్”, “ప్రతిఛాయ”, “24” విడుదల అవుతుండగా, నెట్‌ఫ్లిక్స్‌లో “రెజిల్ మేనియా”, “అన్ చూజన్”, “హల్క్ హోగన్ రియల్ అమెరికన్”, “స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రం 85”, “అపెక్స్” వస్తున్నాయి.
సన్ నెక్స్ట్లో “లేచింది మహిళా లోకం”, జీ5లో “బ్యాండు మేళం”, “జిరాక్స్” విడుదల అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో “ఫ్రమ్ సీజన్ 4”, “కెవిన్”, “కిల్లింగ్ గ్రౌండ్స్”, “హ్యాపీ రాజ్”, “నాటీ బిజినెస్” అందుబాటులోకి వస్తాయి. లయన్స్ గేట్ ప్లేలో “గ్రీన్ ల్యాండ్ 2 మైగ్రేషన్”, ఆపిల్ టీవీ ప్లస్‌లో “క్రిమినల్ రికార్డ్”, “మై బ్రదర్ ద మినోటర్” విడుదల అవుతున్నాయి. మొత్తంగా ఈ వారం థియేటర్ల కంటే ఓటీటీల్లోనే ఎక్కువ వినోదం అందుబాటులో ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!