

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పింది. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది.
ఢీకొన్న వెంటనే బస్సుకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో అక్కడుగా వెళ్తున్న డీసీఎం డ్రైవర్ సహాయంతో బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. కిటికీల్లోంచి దూకడంతో పదిమందికిపైగా ప్రయాణికులు స్వల్ప గాయాలపాలయ్యారు. బస్సు, లారీ పూర్తిగా దగ్ధమవగా ప్రయాణికుల లగేజీ బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!