

2017 లో జరిగిన ఉన్నావో అత్యాచారం కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం, సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా తన వాదనలు కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది.
ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తో పాటు ఇతర న్యాయమూర్తులు విచారించారు. పోక్సో చట్టం కింద ‘పబ్లిక్ సర్వెంట్’ నిర్వచనం పై స్పష్టత అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే, ఈ వ్యవహారంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రశ్నే లేదని కోర్టు స్పష్టం చేసింది. కుల్దీప్ సెంగార్ ప్రస్తుతం జైలులోనే ఉన్నారని, బాధితురాలి తండ్రి కస్టడీ మృతి కేసులో విధించిన శిక్షను అనుభవిస్తున్నారని పేర్కొంది.
ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు ఉన్నావో అత్యాచార బాధితురాలి పిటిషన్‌కు కూడా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!