

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలను మరమ్మతులు చేసి త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ దిశగా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని పరీక్షలు, నమూనాల సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.
మేడిగడ్డ వద్ద కుంగిపోయిన భాగంతో పాటు మొత్తం బ్యారేజ్‌పై సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. అక్కడ 500 బోరు బావులు తవ్వడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు. అవసరమైన యంత్రాలు సమకూర్చి పనులను వేగవంతం చేయాలని, డిసెంబరు వరకు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం అస్సలు ఉండకూడదని, నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!