

గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్ భారత్‌లో దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నెల 26 న దేశవ్యాప్తంగా దాడులు జరగవచ్చన్న సమాచారం నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో జైషే ఉగ్రవాదులు ‘26-26’ అనే కోడ్ నేమ్‌తో దాడుల ప్రణాళిక రూపొందించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఢిల్లీలో అనుమానితుల ఫొటోలతో వాంటెడ్ నోటీసులు జారీ చేయగా, సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఉగ్రవాదుల టార్గెట్ ఢిల్లీ ఒక్కటే కాదని, హైదరాబాద్ సహా అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అనుమానాస్పద కదలికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్ల వద్ద భద్రతను మరింత పెంచారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!