
గాసిప్స్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 18 న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌కు బయలుదేరనుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 19 న అక్కడికి చేరుకోనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి, 20 నుంచి 23 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వార్షిక సదస్సులో పాల్గొంటారు. మరోవైపు, దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా, ఇద్దరు సీఎంల బృందాలు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు మరియు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడి అవకాశాలపై చర్చించనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!