
రాజకీయాలు

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు వారి హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయసేవా సంస్థ మరియు పాఠశాల విద్యాశాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వ, జడ్పీ, గురుకుల, నమూనా పాఠశాలల్లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు న్యాయ విద్యపై శిక్షణ ఇవ్వనున్నారు. బాలల హక్కులు, బాల్య వివాహాలు, బాలకార్మిక నిషేధ చట్టాలు, ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ప్రతి పాఠశాలలో బాలల సంరక్షణ అధికారిగా ఒక ఉపాధ్యాయుడిని నియమించడంతో పాటు న్యాయ అవగాహన సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది.



.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!