

సంపూర్ణేశ్ బాబు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట వంటి సినిమాలతో కామెడీ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో బిర్యానీ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఆయన నటించిన సోదరా అనే సినిమా గత ఏడాది విడుదలై పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమా ఓటీటీ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలంగాణలోని పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, పవన్ అన్నదమ్ముల కథ చూపించారు. చిరంజీవి పెళ్లి కాకపోవడంతో బాధపడుతుంటాడు. ఇలాంటి సమయంలో ఎదురింట్లోకి వచ్చిన దివిని ఇద్దరూ ప్రేమించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తాయి. మరోవైపు పవన్ కాలేజీలో భువిని ప్రేమిస్తాడు. చివరికి అన్నదమ్ములు మళ్లీ కలుస్తారా, చిరంజీవికి పెళ్లి జరుగుతుందా లేదా అన్నదే మిగతా కథ. ఈ సినిమా వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆహా వేదికలో ప్రసారం కానుందని ప్రకటించారు.


.jpg&w=3840&q=75)
.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!