

భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ మురళీకృష్ణలు సాదర స్వాగతం పలికారు. అనంతరం అర్చక బృందం ఆలయ సంప్రదాయాల ప్రకారం మర్యాదపూర్వక స్వాగతం అందించింది.
తదుపరి ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి ఆలయాలను సందర్శించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో కలిసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు.
అలాగే శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని కూడా ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు రామమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తితో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!