
క్రీడలు

నాగార్జున అక్కినేని 100వ చిత్రం కింగ్100 ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు రా కార్తిక్ తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. నాగార్జున సినీ ప్రయాణానికి గుర్తుగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తుండగా, షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై కీలక భాగాలు పూర్తవుతున్నాయి.
ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం టబు చేరడం ప్రాజెక్ట్‌కు మరింత ఆసక్తిని తెచ్చింది. గతంలో నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే వంటి విజయవంతమైన చిత్రాల్లో నాగార్జున-టబు జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే సిసింద్రీలో కూడా ఆమె ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈసారి ఈ జోడీ మరోసారి కలవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!