

ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ రంగానికి మరో పెద్ద ముందడుగు పడుతోంది. గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్కు నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు కోసం సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించారు. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో, 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మించబడనుంది.
ఇప్పటికే విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి గూగుల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ముందురోజు రాత్రి వారికి ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేశారు.
నేడు ఉదయం 08:45 గంటలకు విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ నుంచి తర్లువాడకు బయలుదేరే సీఎం, 09:15 గంటలకు కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం 09:30 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తరువాత మధ్యాహ్నం 01:55 గంటలకు సింహాచలం వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంను దర్శించుకోనున్నారు. ఆపై 02:40 గంటలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 04:20 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి అమరావతికి బయలుదేరనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!