

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కోల్‌కతాలోని హుగ్లీ నదిలో బోటు రైడ్ చేశారు. నది అందాలను ఆస్వాదిస్తూ కెమెరాతో ఫొటోలు తీసిన ఆయన, ఆ చిత్రాలను తన ఎక్స్ ఖాతాలో కూడా పంచుకున్నారు. హుగ్లీ నది బెంగాల్ సంస్కృతితో గాఢంగా ముడిపడి ఉందని మోదీ పేర్కొన్నారు. బెంగాలీల జీవితాల్లో గంగానదికి ప్రత్యేక స్థానం ఉందని, దాని నీరు ఒక ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకెళ్తుందని తెలిపారు.
ఉదయం సమయంలో హుగ్లీ నది తీరంలో కొంత సమయం గడిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పడవ నడిపేవారితో పాటు ఉదయపు నడకకు వచ్చిన స్థానికులతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. పడవ కార్మికుల శ్రమను ఆయన ప్రశంసించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. హుగ్లీ నది ఒడ్డున గడిపిన సమయం ఎంతో ప్రత్యేకమని చెప్పిన మోదీ, చారిత్రక విద్యాసాగర్ సేతు మరియు హావ్‌డా వంతెనను దగ్గరగా చూడడం ఆనందంగా ఉందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!